![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -926 లో...... రాజ్ ని పోలీసులు అరెస్ట్ చెయ్యగానే కావ్య టెన్షన్ పడుతూ కింద పడిపోతుంది. వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. బీపీ ఎక్కువ ఉందని డాక్టర్ చెప్తుంది. మా ఆయనని పిలిపించండి అని డాక్టర్ తో కావ్య అంటుంది. డాక్టర్ బయటకు వెళ్లి పేషెంట్ సిచువేషన్ క్రిటికల్ గానే ఉందని చెప్తుంది.
మరొకవైపు సుభాష్, కళ్యాణ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. బెయిల్ దొరకడానికి ఇంకా రెండు రోజులు పడుతుందట అని సుభాష్ అనగానే బెయిల్ ఏంటి నాన్న.. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలని రాజ్ అంటాడు. అన్నయ్య అక్కడ వదిన పరిస్థితి బాలేదని కళ్యాణ్ అనగానే రాజ్ టెన్షన్ పడతాడు. అప్పుడే సుభాష్ కి అప్పు ఫోన్ చేసి మావయ్య అక్క సిచువేషన్ బాలేదు. ఆపరేషన్ చెయ్యాలి అంటున్నారని చెప్తుంది. అదే విషయం రాజ్ కి సుభాష్ చెప్తాడు. రాజ్ మరింత టెన్షన్ పడతాడు.
కావ్యకి త్వరగా ఆపరేషన్ చేయకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికి ప్రమాదమేనని డాక్టర్ చెప్తుంది. మరోవైపు రాహుల్ వంక అప్పు చూసి.. మొన్న మీరు సూట్ కేసు తీసుకొని వచ్చారు కదా అందులో ఏముందని అనుమానంగా అడుగుతుంది. ఏంటి అప్పు అలా అడుగుతున్నావని రాహుల్ అంటాడు. నువ్వు అప్పుడు ఎందుకో టెన్షన్ పడ్డావని అప్పు అనగానే అప్పుపై స్వప్న కోప్పడుతుంది. తరువాయి భాగంలో కావ్యకి అన్నయ్య వస్తున్నాడని కళ్యాణ్ అబద్ధం చెప్తాడు. కళ్యాణ్ చెప్పింది అబద్ధమని కావ్యకి తెలిసి హాస్పిటల్ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |